Home రాజకీయాలు ఏబీఎన్‌, పరిటాల బంధువుకు షాక్.. తోపుదుర్తి కేసులో కోర్టు తీర్పు

ఏబీఎన్‌, పరిటాల బంధువుకు షాక్.. తోపుదుర్తి కేసులో కోర్టు తీర్పు

1596
SHARE

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి అనంతపురం కోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం దావా కేసును విచారించిన కోర్టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేసినట్టు   తీర్పు చెప్పింది.

2011లో వైసీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈ తీర్పు చెప్పింది. జూబ్లిహిల్స్‌ కారు బాంబు వ్యవహారంలో తన హస్తముందంటూ పరిటాల సునీత బంధువు నారాయణ చౌదరి, ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేశారంటూ ప్రకాశ్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

పరువు నష్టం దావా వేశారు. కేసును విచారించిన అనంతపురం కోర్టు… కారు బాంబు కేసులో తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. నారాయణ చౌదరి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేసినట్టు నిర్ధారించింది.

తప్పుడు ప్రచారంతో ప్రకాశ్‌ రెడ్డి పరువుకు నష్టం కలిగించినందుకు గాను.. పరిటాల బంధువు నారాయణ చౌదరి 10 లక్షల రూపాయలు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

తీర్పును తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్వాగతించారు. తనను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేసిన వారికి తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారాయన.