Home రాజకీయాలు ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వరావు, సతీష్ చంద్ర

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వరావు, సతీష్ చంద్ర

SHARE

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీజీ వెంకటేశ్‌తో పాటు మరో నలుగురు టీడీపీనేతలు ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని నడుపుతున్నారని చెప్పారు.

రాజకీయ నాయకులే కాకుండా ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఈ వ్యవహారంలో చురుగ్గా పనిచేస్తున్నారని మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి చెప్పారు.

వారిద్దరూ టీడీపీ కార్యకర్తల తరహాలో పనిచేస్తున్నారని వివరించారు. వారిద్దరూ ఐఏఎస్, ఐపీఎస్‌ను వదిలేసి టీడీపీలో చేరితే బాగుంటుందని చెప్పారు.

సతీష్ చంద్ర, వెంకటేశ్వరరావుపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు వైసీపీ ఎంపీ వివరించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని… కాబట్టి ఎన్నికలకు వారం ముందు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఈసీని విజయసాయిరెడ్డి కోరారు.

స్పీకర్ కోడెల శివప్రసాదరావు చంద్రబాబుకు తొత్తుగా మారి… ఫిరాయింపుదారులకు అండగా ఉంటున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి టీడీపీనేతలు, ఐఏఎస్ సతీష్ చంద్ర, ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్రపై అన్ని వివరాలు త్వరలోనే బహిర్గతం చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

మొత్తం టీడీపీ నేతల సంగతి పక్కన పెడితే… ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు కూడా ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలు ఎదుర్కోవడం కలకలం రేపే అంశమే.