Home సినిమా పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌ చేయడానికి 50 లక్షలు !

పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌ చేయడానికి 50 లక్షలు !

SHARE

గతంలో హీరోయిన్ గా నటించే వారు ఐటమ్ సాంగ్స్ చెయ్యడానికి ఒప్పుకునే వారు కాదు. కానీ ఇప్పుడు అలా ఏమి లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడదే ట్రెండ్ గా మారింది. స్టార్ హీరోయిన్ మంచి ఫాంలో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ లో కూడా తళుక్కుమంటున్నారు. స్టార్ హీరోయిన్లు అయిన కాజల్, తమన్నా కూడా స్పెషల్ సాంగ్ లతో అలరించారు. ఇప్పుడీ లిస్టులోకి మరో అందాల భామ కూడా చేరుతుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. మాములుగా సుకుమార్ సినిమాలో వుండే స్పెషల్ సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందులోను రామ్ చరణ్ పక్కన డాన్స్ చెయ్యాలంటే చాలా మంది హీరోయిన్స్ మక్కువ చూపుతారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ కు పూజ హెగ్డే ని ఎంచుకున్నారట. దీనికి పూజ హెగ్డే కూడా ఒప్పేసుకుందట.

అయితే పూజ హెగ్డే ఈ సాంగ్ చెయ్యడానికి పెద్ద మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ ను అందుకుంటుందని సమాచారం. పూజ ఈ స్పెషల్ సాంగ్ చెయ్యడానికి దాదాపుగా 50 లక్షల రూపాయల పారితోషికంను అందుకుంటుందట. ప్రస్తుతం పూజకు మంచి డిమాండ్ ఉండడంతో ఇంత పారితోషికం ఇవ్వడానికి ఒప్పుకున్నారట.