Home రాజకీయాలు బీజేపీ, టీడీపీ లు మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసుకునే ఇలా చేశారు !

బీజేపీ, టీడీపీ లు మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసుకునే ఇలా చేశారు !

SHARE

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పలు వ్యాఖ్యలు చేశారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం చెందింది. మిడి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శాసనమమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పందించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ను పార్లమెంట్ తలపులు మూసేసి మరి విభజించారని మాట్లాడడం చాలా దారుణంగా ఉందని అన్నారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ నేతలు ఏమని సమాధానమిస్తారని అడిగారు.

ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మోడీ పక్కనబెట్టి మరి వారిని అపహాస్యం చేస్తే పట్టించుకున్న వారే లేరని అన్నారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పక్ష నేత అయిన మల్లి ఖార్జున్ ఖర్గే నిలదీస్తుంటే… టీడీపీ, బీజేపీ లు మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసుకొని మరి కావాలనే ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారని పొంగులేటి ధ్వజమెత్తారు. వరంగల్లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ప్రాణహిత– చేవెళ్లకు జాతీయహోదా మరియు తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి తాము పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలతీసి అడిగితే దిక్కులేకుండా పోయిందని అన్నారు.