Home రాజకీయాలు ఆంధ్రప్రజల గుండె మండే వ్యాఖ్య చేసిన సుజనా

ఆంధ్రప్రజల గుండె మండే వ్యాఖ్య చేసిన సుజనా

3436
SHARE

తెలుగుదేశం పార్టీ నాటకం మరోసారి బట్టబయలైంది. కేంద్రమంత్రి సుజనాచౌదరే తన వ్యాఖ్యల ద్వారా విభజన చట్టం అమలుపై తమకున్న చిత్తశుద్ది ఏపాటితో బయటపెట్టుకున్నారు.

చట్టం అమలు కోసం తెలుగు ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే.. ప్రతిపక్ష సభ్యులో పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలతో అల్లాడిస్తుంటే.. కేంద్రమంత్రి సుజనాచౌదరి మాత్రం తెలుగు ప్రజలు గుండెలు పగిలే ప్రతిపాదన చేశారు.

బడ్జెట్‌ ఆమోదంలో తన భాగస్వామ్యం ఉందన్నది కూడా మరిచి.. రాజ్యసభ, లోక్‌సభలో ఒక ప్రతిపాదన పెట్టారు. విభజన చట్టం అమలుపై 15 రోజుల్లో అరుణ్ జైట్టీ స్పందించాలని కోరారు.

అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ 15 రోజుల్లో స్పందించలేని పక్షంలో ఈ అంశంపై చర్చించేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రెండు గంటల సమయం కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై వైసీపీ ఎంపీలు భగ్గుమన్నారు.

ఇంత సీరియస్ అంశాన్ని తప్పుదారి పట్టించి… ముగింపు పలికేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాలకు వ్యవహారాన్ని వాయిదా వేసేందుకు ఈ ప్రకటన చేశారని మండిపడ్డారు. సుజనా ప్రతిపాదనతో టీడీపీ దొంగనాటకం మరోసారి స్పష్టమైందని విమర్శించారు.