Home సినిమా త్వరలోనే అదుర్స్- 2 చేస్తా !

త్వరలోనే అదుర్స్- 2 చేస్తా !

SHARE

2010 వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించి, అతని పాత్రకు న్యాయం చేశాడు. అంతేకాదు ఈ సినిమా భారీ వసూళ్లు కూడా రాబట్టింది. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఫిదా అయిన సంగతి మనకి తెలిసిందే. అంతటి గొప్ప సినిమాకు దర్శకత్వం వహించిన వి.వి. వినాయక్ త్వరలోనే ఈ సినిమాకు సీక్వల్ చేస్తానని చెబుతున్నాడు.

అయితే వి.వి. వినాయక్ దర్శకత్వంలో తాజాగా రాబోతున్న సినిమా “ఇంటిలిజెంట్”. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ఈ సినిమా యూనిట్ అంతా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వి.వి.వినాయక్‌ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో వినాయక్ చాలా విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. వినాయక్ ను యాంకర్ “అదుర్స్- 2 “సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడగగా.. వినాయక్ ” మేము ఇప్పటికే రెండు మూడు కధలను అనుకున్నాం. కానీ వాటితో మేము శాటిస్ ఫై అవ్వడం లేదు. అదుర్స్ సినిమా ను మించిన కథతో అదుర్స్ -2 ని తీయాలని అటువంటి కదా కోసం తాను ఎదురుచూస్తున్నాను” అని సమాధానమిచ్చాడు. ఏది ఏమైనా “అదుర్స్-2” మాత్రం కచ్చితంగా చేస్తాను అని వి.వి. వినాయక్ తెలిపారు.