Home రాజకీయాలు ఆ నవ్వేంటి రేణుకా… పక్కున నవ్విన రాజ్యసభ

ఆ నవ్వేంటి రేణుకా… పక్కున నవ్విన రాజ్యసభ

467
SHARE

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వు చర్చకు దారి తీసింది. బిగ్గరగా అసహజంగా ఆమె నవ్వును చూసి చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా ఆశ్చర్యపోయారు.

ప్రధాని మోడీ తన ప్రభుత్వ పనితీరును వివరిస్తున్న సమయంలో రేణుకా చౌదరి హఠాత్తుగా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. ఆమె మైక్‌ లేకుండా నవ్వినప్పటికీ మోడీ స్పీచ్‌ కంటే ఆమె నవ్వే ఎక్కువగా వినిపించింది. దీంతో కంగుతిన్న వెంకయ్య.. ప్రధానిని కాసేపు స్పీచ్ ఆపాల్సిందిగా కోరారు.

రేణుకా చౌదరిని నీకేమైంది అంటూ ప్రశ్నించారు. ఏదైనా తేడా ఉంటే ఆస్పత్రికి వెళ్లు అంటూ వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆమె అయినప్పటికీ అసహజంగా భీకరంగా నవ్వుతుండడంతో సిట్‌ డౌన్ రేణుకా అంటూ వెంకయ్య హెచ్చరించారు.

ఇంతలో జోక్యం చేసుకున్న మోడీ… ఇలాంటి నవ్వును రామాయణం సీరియల్‌లో చూసేవారిమని.. ఇప్పుడు రేణుకాచౌదరి వల్ల మరోసారి ఆ భాగ్యం కలిగిందంటూ సెటైర్ వేశారు. దీంతో ఈసారి పెట్టున నవ్వడం బీజేపీ సభ్యుల వంతైంది. రేణుకా చౌదరి మాత్రం వెంటనే నవ్వు ఆపేశారు. మోడీ రామాయణం సీరియల్‌లో నవ్వుతో పోల్చడం ద్వారా రేణుకా చౌదరిని రామాయణంలోని రాక్షస క్యారెక్టర్‌తో పోల్చి ఉండవచ్చని సభ్యులు భావించారు.