Home సినిమా జీఎస్టీ-2లో నటించేందుకు రష్మీ సిద్ధమేనా?

జీఎస్టీ-2లో నటించేందుకు రష్మీ సిద్ధమేనా?

365
SHARE

రష్మీ నిన్న అనసూయను సపోర్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టింది. దీనితో రష్మీ కూడా వివాదాస్పదమైంది. అయితే రష్మీ తాజాగా కొంతమంది నెటిజన్లతో చిట్ చాట్ ను నిర్వహించింది. ఈ చిట్ చాట్ లో భాగంగా ఓ నెటిజన్ రష్మిని మీకు కానీ జీఎస్టీ – 2లో నటించేందుకు అవకాశం వస్తే అందుకు మీరు సిద్ధమా ? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రష్మీ అదిరిపోయే జవాబు ఇచ్చింది.

రష్మీ “జీఎస్టీ-2 లో ఏమో కానీ జీటీ-2 లో అయితే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అది కూడా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తేనే” అని జవాబు ఇచ్చింది. ఇంతకీ జీటీ-2 అంటే ఏంటా అని అనుకుంటున్నారు కదా? జీటీ-2 అంటే గుంటూరు టాకీస్ -2 అట. ఇంతలో మరో నెటిజన్ మేడమ్ నైట్ డిన్నర్ ఎక్కడా? అంటే మీకంటూ సెపరేట్ హోటల్ ఉంటుందంట కదా అని అడగగా దానికి రష్మీ “లేదమ్మా… మేము కూడా మీలానే ఇంట్లో వండిన నార్మల్ రోటీ, రైస్, పప్పులను తింటాం” అని సమాధానమిచ్చింది.