Home రాజకీయాలు బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు రోజులవుతున్నా… చంద్రబాబు బయటకు రారే !

బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు రోజులవుతున్నా… చంద్రబాబు బయటకు రారే !

SHARE

విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మాట్లాడుతూ… “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజూ మీడియాతో గంటలు, గంటలు మాట్లాడుతూ ప్రజలను బోరు కొట్టిస్తూ ఉంటారని, కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఐదు రోజులు అవుతున్నా కూడా బాబు ఇంతవరకు మీడియాకు ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన మీడియా ముందుకు రాకుండా కేవలం తనకున్న అనుకూల మీడియాతో లీకులు ఇప్పిస్తున్నాడని అన్నారు. ఇక ఆయన అనుకూల మీడియానేమో చంద్రబాబు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చిటపటలాడుతున్నారని ఊదరగొడుతూ ప్రచారం చేస్తుందని అన్నారు.

నాకు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందని విమర్శించారు. చంద్రబాబు పార్టీకి సంబంధించిన ఎంపీలే కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని, వాళ్ళందరూ ఆమోదించిన తరువాతనే పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుందని జగన్ మరోసారి గుర్తుచేశారు. చంద్రబాబు తాను చేసే తప్పులను మరియు ఆయన వైఫల్యాలను కేంద్రం మీదకు నెట్టేందుకే ఇలా వ్యవహరిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతివిషయంలో కూడా విలువలేని రాజకీయాలు చేస్తూ విశ్వసనీయత కోల్పోయారని జగన్ ధ్వజమెత్తారు.