Home రాజకీయాలు చెవిరెడ్డి నీవు గ్రేటయ్య!.. ముద్దు కృష్ణమ కోసం ఏంచేశారో తెలుసా?

చెవిరెడ్డి నీవు గ్రేటయ్య!.. ముద్దు కృష్ణమ కోసం ఏంచేశారో తెలుసా?

14119
SHARE

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మరోసారి తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలు టీడీపీ- వైసీపీల మధ్య వ్యక్తిగత వైరుధ్యాల స్థాయికి వెళ్లిపోయినా చెవిరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.

మొన్నటి వరకు కూడా వైసీపీని, ఆ పార్టీ నేతలను తీవ్రంగా విమర్శించిన వారిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ముందుండేవారు. అయితే అనారోగ్యంతో ఆయన మృతి చెందారు.

వైసీపీ సభ్యులు కూడా నివాళుర్పించారు.  చెవిరెడ్డి మాత్రం అంతటితో ఆగలేదు. పార్టీలు వేరయని తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.

టీడీపీ నాయకులు కూడా చేయని పనిని చేశారు. చిత్తూరు జిల్లా ఎడిషన్‌లో ప్రధాన పత్రికల్లో ఫుల్‌ పేజ్‌లో యాడ్‌ ద్వారా నివాలర్పించారు చెవిరెడ్డి. ”ముద్దన్నా నీవు మళ్లీ ఈ గడ్డపైనే, మాకోసం చంద్రగిరిలో జన్మించవా!” అంటూ ఆశ్రునివాళి అర్పించారు.

ఎప్పటికీ నిన్ను మరిచిపోలేం అంటూ నివాళుర్పించారు. చెవిరెడ్డి చర్యను చూసి స్థానికులు మొచ్చుకుంటున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా మానవసంబంధాల పట్ట ఇలాగే వ్యవహరించాలని.. మిగిలిన నేతలు కూడా ఇదే తరహాలో హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.