Home రాజకీయాలు పవన్‌కళ్యాణ్‌ పిచ్చి పిచ్చి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం మానుకో !

పవన్‌కళ్యాణ్‌ పిచ్చి పిచ్చి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం మానుకో !

3101
SHARE

మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద నుండి బయటకు వస్తున్న ప్రయాణికులకి బూట్లకు గిరిజన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు పాలిష్‌ చేసి, వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాదిగాని గుర్నాధం మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ తనకి ఎవరు జిందాబాద్‌ అంటే వారికి కులాలు, స్ధితిగతులు , జాతుల ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోకుండా వరాలు ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఇప్పటికైనా పిచ్చి రాజకీయాలను మానుకోవాలని అన్నారు.

పవన్ నువ్వు నీ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎస్టి జాబితాలోకి మత్స్యకారులను చేరుస్తానని హామీ ఇస్తావా? వారికీ అలా హామీ ఇచ్చి మాకు అన్యాయం చేస్తావా ? పవన్ కళ్యాణ్… ఖబడ్దార్‌… అంటూ గుర్నాధం మండిపడ్డారు. మత్స్యకారులకు పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవాలని అన్నారు. పవన్ పిచ్చి పిచ్చి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం మానుకుంటే అతనికి మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి రిజన సంఘాల నాయకులు అయిన పేరం సత్యం, మేడా రమేష్‌, రవివర్మ, సరోజా , ఎం.నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.