Home సినిమా పక్కా ప్లానింగ్ తో ఉన్న నితిన్ !

పక్కా ప్లానింగ్ తో ఉన్న నితిన్ !

SHARE

నితిన్ తన తర్వాత సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నాడని నితిన్ చేసిన ఈ ట్విట్ తోనే తెలిసిపోతుంది. నితిన్ ఎటువంటి తడబాటు లేకుండా తన తర్వాత సినిమాకు సంబంధించిన వివరాలన్నిటిని ఖరారు చేసేశారు.

నితిన్ 25వ సినిమాని త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను, టీజర్ ను మరియు ఈ సినిమాను విడుదల చేసే తేదీలతో సహా అన్నిటిని నితిన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ నెల 12 వ తేదీన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను, 14వ తేదీన టీజర్ ను మరియు ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నితిన్ తెలిపాడు.

నితిన్ ఒకేసారి ఈ వివరాలన్నిటిని ప్రకటించడంతో ఈ సినిమా ఎంత పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతుందో అనేది మనం అర్ధం చేసుకోవొచ్చు. ఈ సినిమాకి రౌడీ ఫెలో ఫేమ్ అయిన కృష్ణ చైతన్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ నటిస్తుంది. ఇక సంగీతం విషయానికొస్తే తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.