Home రాజకీయాలు చంద్రబాబు నాయుడు సహనం కొంప ముంచుతుంది : టీడీపీ ఎంపీ !

చంద్రబాబు నాయుడు సహనం కొంప ముంచుతుంది : టీడీపీ ఎంపీ !

881
SHARE

పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసన తరువాత టీడీపీ ఎంపీ జెసి దివాకరరెడ్డి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా సహనం ఉందని… కానీ ఆ సహనమే ఇప్పుడు కొంప ముంచుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ విషయంలో, బీజేపీ వ్యవహార తీరుపై కానీ, బీజేపీ నాయకులు చేసే విమర్శలపై కానీ చంద్రబాబు ఎంతో సహనంగా ఉన్నారని అన్నారు. కానీ, చంద్రబాబు ఎంత సహనం చూయించిన వారి వలన కలిగే ప్రయోజనమేమి ఉండదని తాము చెబుతున్నామని అన్నారు. మరి చంద్రబాబు ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది మాకు కూడా అర్ధం కావడం లేదని, ఆయన నిర్ణయం ఏంటో అనేది మాత్రం వేచి చూడాల్సిందేనని అన్నారు.

అనంతరం మరో ఎంపీ అయిన మురళీమోహన్ మాట్లాడుతూ… తమ పోరాటం అనేది ఎవరిని నొప్పించకుండా సాగుతుందని అన్నారు. తెలుగువారి గౌరవం కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. నారదుడు అంటే సమాచారం సేకరించేవారని, అందుకే తాను మోడీకి నారదుడి వేషధారణలో ఈ సందేశంను పంపిస్తానని అన్నారు.