Home రాజకీయాలు చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉంది !

చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉంది !

SHARE

సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉందని అన్నారు. చంద్రబాబు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన అన్ని రోజులు ఆయనకీ ఇబ్బందేమి ఉండదని, ఒకవేళ చంద్రబాబు కానీ కేంద్రం నుండి బయటకు వస్తే అతనిపై ఉన్న కేసులను లేవనెత్తి మరి బాబుని జైలు కు పంపుతారని అన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే కేంద్రంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా తమ పార్టీ నాయకులను వారిపై నోరు తెరవొద్దని చెబుతున్నారని అన్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఎటువైపు వెళ్లాలో అనేది అర్ధం కాకా గందరగోళంలో ఉన్నారని అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు భజన చేసే పనిలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు కేంద్రం నుండి బయటకు వచ్చే వరకు రాష్ట్రానికి ఏమి చేయలేరని అన్నారు.