Home రాజకీయాలు తడిసి మోపెడు అవుతున్న ఏపీ అప్పు !

తడిసి మోపెడు అవుతున్న ఏపీ అప్పు !

673
SHARE

రోజురోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పు తడిసి మోపెడు అవుతుంది. మన రాష్ట్రము ఏడాదికి కేవలం వడ్డీ కిందనే 14 వేల కోట్ల రూపాయలను చెల్లిస్తుందంటే ఇక అసలు ఏ మాత్రం ఉంటుందో అనేది మనం అర్ధం చేసుకోవొచ్చు. ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్‌.రాధాకృష్ణ గత ఏడాది మార్చి నాటికి 2,16,027 కోట్ల రూపాయలు మేర అప్పుల భారం ఉన్నట్లు రాజ్యసభకు తెలిపారు. అయితే వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఈ విషయంపై అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ వివరాలన్నిటిని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2017–18 ఆర్థిక సంవత్సరంలో అప్పులపై కేవలం వడ్డీ కిందనే 14,738 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేసింది. 14వ ఆర్థిక సంఘం రూపొందించిన ద్రవ్య సూచిక ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 2 5.09% ఉంటుందని అంచనా వేసుకోగా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంచనా 28.11%కు చేరే అవకాశం ఉందని భావిస్తుందంట.  భావిస్తుందంట.