Home సినిమా గుడ్ బై చెప్పేసిన యాంకర్ అనసూయ !

గుడ్ బై చెప్పేసిన యాంకర్ అనసూయ !

674
SHARE

అతి తక్కువ కాలంలో ఎక్కువ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఘనత యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ‌కు దక్కుతుంది. తన అందాలతో బుల్లితెరతో పాటుగా వెండితెరను కూడా హీట్ ఎక్కించే అనసూయ ఇప్పుడు ట్విట్టర్ కి గుడ్ బై చెప్పడంతో ఈ వార్త చాలా సెన్సేష‌న్‌గా మారింది. అనసూయ తన ప్రాజెక్టు విషయాలను మరియు తన ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలాంటి అనసూయ ఇప్పుడు తన పేస్ బుక్ మరియు ట్విట్టర్ లకు గుడ్ బై చెప్పడంతో ఆమె అభిమానులు షాక్ కు గురి అయ్యారు.

మంగళవారం అనసూయ తమ ఫోన్ లాక్కొని పగలగొట్టిందంటూ ఓ మహిళా మీడియా ముందు ఫిర్యాదు చెయ్యడంతో అనసూయపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన అనసూయ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా నెటిజన్లు ఆమె మాట వినకుండా అలానే విమర్శలు కురిపిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన అనసూయ వెంటనే తన సోషల్ మీడియా అంకౌట్లు అన్నిటిని డిలీట్‌ చేసింది. అనసూయ నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకోని ఉంటుందని అందరు అనుకుంటున్నారు.