Home రాజకీయాలు రేయ్‌ కోసేస్తా.. ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాక్ ట్రీట్‌మెంట్‌

రేయ్‌ కోసేస్తా.. ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాక్ ట్రీట్‌మెంట్‌

3982
SHARE

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నుంచి తీవ్ర అవమానం జరిగింది. గోరంట్ల ఇచ్చిన షాక్‌తో అప్పారావు కంగుతిన్నారు. రాజమండ్రి కార్పొరేషన్‌ సమావేశంలోనే గోరంట్ల నోటికొచ్చినట్టు తిట్టడంతో ఆదిరెడ్డి అప్పారావు పరువు గంగలో కలిసిపోయింది.

ఇటీవల మీడియా సమావేశం పెట్టిన అప్పారావు.. తాను రాజమండ్రికి చాలా నిధులు తెచ్చానని చెప్పారు. దీన్ని కార్పొరేషన్ సమావేశంలో ప్రస్తావించిన గోరంట్ల.. తన నియోజకవర్గంలో నీకేం పని అని ప్రశ్నించారు. నా నియోజకవర్గం పరిధిలోకి రాకుండా నీ పని నీవు చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను ఎమ్మెల్సీనని తనకు కూడా నియోజకవర్గంలో పనిచేసే హక్కు ఉందని అప్పారావు కౌంటర్ ఇచ్చారు. దీంతో గోరంట్ల రెచ్చిపోయారు.

రేయ్ కోసేస్తా అంటూ కేకలు వేశారు. నీవెంత నీ బతుకెంతా అంటూ దూషించారు. ఉంటే ఉండు లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిపో, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. వేషాలు వేయకు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటూ విరుచుకుపడ్డారు.

తమ నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే చూస్తూ ఉండడానికి తాను, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చవటలమనుకుంటున్నావా అంటూ అప్పారావుపై విరుచుకుపడ్డారు . ఇంతలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా గోరంట్లతో గొంతు కలిపారు. దీంతో ఒంటరైపోయిన అప్పారావు.. మౌనంగా ఉండిపోయారు.

వైసీపీలో ఉన్నప్పుడు తనను గౌరవంగా చూసుకునే వారని… కానీ చంద్రబాబును నమ్మకుని పార్టీ ఫిరాయిస్తే ఇలా అవమానాలు మాత్రమే మిగిలాయని అప్పారావు సన్నిహితుల వద్ద వాపోయినట్టు చెబుతున్నారు.