Home రాజకీయాలు సోము వీర్రాజు దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డకౌట్ !

సోము వీర్రాజు దెబ్బకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డకౌట్ !

310
SHARE

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిది జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ… “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ నేత అయిన సోము వీర్రాజు దెబ్బకు డకౌట్ అయ్యారని ఎద్దేవా చేశారు. వీర్రాజు, చంద్రబాబుని అడిగిన ప్రశ్నకు ఇంతవరకు చంద్రబాబు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బయటకు వచ్చి ఈ విషయంపై సమాధానం చెప్పాలని… లేకుంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధం కావాలని అన్నారు. సీబీఐ విచారణలోనే నిజాలు బయటకొస్తాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలక ముందు ఆయనకు రెండెకరాలు మాత్రమే ఉండగా… మరి ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించగలిగారు అని చంద్రబాబుని నేరుగా ప్రశ్నించారు.

వీర్రాజు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమివ్వలేక బుద్దా వెంకన్న మరియు కాల్వ శ్రీనివాసులను రంగంలోకి దించారని అన్నారు. సోము వీర్రాజు ఎవరో కాదని టీడీపీకి మిత్ర పక్ష నేతనే.. మరి అటువంటప్పుడు అతని ప్రశ్నపై బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబుకి కోపం రావాల్సి ఉండగా అదేంటో ఆయనకు తప్ప టీడీపీ నేతలందరికి పూనకం వచ్చిందని ఎద్దేవా చేశారు. బుద్దా వెంకన్నకు ఆ పేరు కాకుండా బుద్ది లేని వెంకన్న అనే పేరును పెట్టాల్సిందని, ఎందుకంటె ఆయన ఎప్పుడూ అడ్డగోలుగానే మాట్లాడుతూ ఉంటారని” ఆయన ఎద్దేవా చేశారు.