Home సినిమా రష్యా కుర్రాడిని వివాహమాడుతున్న శ్రేయ

రష్యా కుర్రాడిని వివాహమాడుతున్న శ్రేయ

SHARE

ఇష్టం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు పదిహేను సంవత్సరాలు గడిచిన కూడా తన ఇమేజ్ ని ఎక్కడ కూడా వదలకుండా ఇంకా ఇప్పటికి కూడా రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉంటున్న నటి శ్రేయ. ఆ భామ ఇప్పుడు తరహా హీరోలతో కూడా నటిస్తుంది. చిరంజీవి నుండి మహేష్ బాబు తో సహా ఆమె హీరోయిన్ గా నటించింది. మంచు విష్ణు తో ఆమె గాయత్రి సినిమాలో నటిస్తుంది. ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ భామ త్వరలో వివాహం చేసుకుంటుందంట.

రష్యాకు చెందిన ఒక అబ్బాయిని తను వివాహం చేసుకోవాలని అనుకుంటుందంట. ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారంట. అయితే ఇప్పుడు ఇద్దరు కూడా వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అయితే ప్రస్తుతం శ్రేయ రష్యాలోని ఉన్నది. తమ పెళ్లి గురించి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతున్నారంటా. అయితే పెళ్లి మాత్రం రాజస్థాన్ లో చేసుకుంటారంట. ఇరు కుటుంబాల అంగీకరంతో రాజస్థాన్ లో కేవలం తన సన్నిహితుల మధ్యనే వివాహం చేసుకుంటుందంట. తరువాత హైదరాబాద్ లోగాని, చెన్నై లోగాని రెసెప్షన్ ప్లాన్ చేసి అందరిని కూడా దానికి పిలుస్తారంట.