Home సినిమా ఏనుగులతో సాహసం చేయనున్న రానా

ఏనుగులతో సాహసం చేయనున్న రానా

183
SHARE

దగ్గుపాటి రానా సినిమాలోకి వారసత్వంగా వచ్చినా కూడా తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంటు మంచి సినిమాలలో నటిస్తున్నాడు. బాహుబలి చిత్రం తరువాత రానాకీ కేవలం తెలుగులోనే కాదు. బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో కూడా బాగా అవకాశాలను సంపాదించుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం రానా “హాతి మేరే సాతి” అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రానున్నది. ఈ సినిమా మొత్తం కూడా ఏనుగుల మీదనే ఉండబోతుందంట.

అయితే ఈ సినిమాలో రానా ఏనుగులకు శిక్షణ ఇచ్చే పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఏనుగులతో సన్నిహితంగా ఉండాలని రెండువారాల పాటు కేరళలో ఏనుగులతో పాటు గడపనున్నాడు. ఇక్కడ రెండు వారాల పాటు ఏనుగులతో గడిపిన తరువాత థాయిలాండ్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. అయితే ఈ సినిమాలో మరొక హీరో కూడా కావాలంట. అయితే దీనికోసం ఇప్పటికి వరుణ్ తేజ్, విజయదేవరకొండ వంటి తరహా హీరోలను సంప్రదిస్తున్నారని సమాచారం. “హాతి మేరే సాతి” సినిమా 1971 వ సంవత్సరంలో హిందీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు దానిని రీమేక్ చేస్తున్నారా? లేదా కొత్త తరహా లో ఉంటుందా అన్న సంగతి మాత్రం ఇంతవరకు నిర్మాతలు వెల్లడించలేదు.