Home రాజకీయాలు ప్ర‌కాష్ రెడ్డికి భయపడుతున్న పరిటాల కుటుంబం !

ప్ర‌కాష్ రెడ్డికి భయపడుతున్న పరిటాల కుటుంబం !

1313
SHARE

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వారు అమలుచేయబోయే న‌వ‌ర‌త్నాల‌ గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. స్థానిక నాయకులు కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి న‌వ‌ర‌త్నాల‌ గురించి వారికీ వివరించాలని వైయ‌స్ జ‌గ‌న్‌ సూచించారు. దీనితో స్థానిక నాయకులు కూడా ఈ పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే అనంత‌పురం జిల్లా, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి కూడా వైయ‌స్ జ‌గ‌న్‌ లానే నిత్యం ప్రజలకున్న సమస్యల గురించి తెలుసుకుంటూ వాటిపై పోరాడుతూ వస్తున్నారు.

ప్ర‌కాష్ రెడ్డి పేరూర్ డ్యాంకు నీటిని విడుద‌ల చేయించ‌డం మరియు ఆయ‌క‌ట్టుకు సాగు నీళ్లను విడుద‌ల‌ చేయించడం వంటి విషయాలపై రైతులతో సమావేశమై మాట్లాడదమని ఈ సమావేశానికి ఆదివారం పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ సమావేశానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన బందోబ‌స్తును క‌ల్పించాల‌ని ప్ర‌కాష్ రెడ్డి, జిల్లా ఎస్పీగారిని కోరారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరు అవ్వడానికి సిద్ధమయ్యారు.

కానీ ఈ సమావేశానికి మరియు, వైసీపీ శ్రేణులకు పొలీసులు అడుగ‌డుగున ఆటంకం కలిగిస్తూనే వచ్చారు,. మంత్రి పరిటాల సునీత ప్ర‌కాష్ రెడ్డి పిలుపునిచ్చిన కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ హాజరవ్వకూడదని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని సమాచారం. అందుకే పోలీసులు ఈ సమావేశానికి ఆటంకం కలిగించారని తెలుస్తుంది. అంతేకాకుండా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా హౌస్ ఆరెస్ట్ లు చేశారు. ప్ర‌కాష్ రెడ్డికి ప్రజలలో భారీగా ఫాలోయింగ్ ఉండడంతో పెద్ద ఎత్తున పొలీసులు వచ్చి గ్రామాల్లో మోహరించారు. దీనిని బట్టి మంత్రి పరిటాల కుటుంబానికి ప్ర‌కాష్ రెడ్డి అంటే ఎంత భయమో అనేది మనం అర్ధం చేసుకోవొచ్చు.