Home రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తారట !

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తారట !

748
SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తానని హెచ్చరించారట. ముఖ్యమంత్రి ధర్నా అనగానే అందరూ… కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగినందుకు గాను చంద్రబాబు నాయుడు ఈ ధర్నా చేస్తున్నారని అనుకుంటేఅనుకుంటారు. అలా అనుకుంటే… మీరు పప్పులో కాలేసినట్లే. అవును… చంద్రబాబు ధర్నా చేస్తాను అని చెప్పింది కేంద్రం, రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కాదు… ఆంధ్రప్రదేశ్ కి ప్యాకేజీ అందడం కోసం కూడా కాదు.

ఆయన ధర్నా చేస్తుంది, శ్రీకాకుళంలోని ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా మరుగుదొడ్లు కట్టించుకోవడం లేదని అట. అక్కడి ప్రజలు మరుగుదొడ్లు కట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందట. అందుకే ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయం చెప్పారట. ప్రజలకు మరుగుదొడ్లు కట్టించుకోండి అని చెప్పడంలో తప్పు ఏమి లేదు. కానీ, ముఖ్యమంత్రే స్వయంగా అక్కడికి వెళ్లి అక్కడ ధర్నా చేస్తాననడంలో అర్థమేమిటో మరి.