Home రాజకీయాలు చంద్రబాబు తీరు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది !

చంద్రబాబు తీరు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది !

225
SHARE

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఓ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఓ మీడియా కేంద్రం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ను చూసి మన ముఖ్యమంత్రిగారు విలవిలలాడిపోయారని ప్రచారం చేస్తుంది. అసలు నాకు చంద్రబాబు తీరును చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

నేను గత రెండు, మూడు రోజుల నుండి టీవీ చూస్తుంటే నాకు రాష్ట్రంలో ఏం జరుగుతుందా అనేది కూడా అర్ధం కావడం లేదు. నాకసలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ను చూసి చంద్రబాబు విలవిలలాడిపోయాడని కొన్ని మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బాబు గత నాలుగేళ్లుగా భాగస్వామిగా ఉన్నాడు. చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు దానిపై ఓ సారి చర్చించి దానిని ఆమోదించడం జరుగుతుంది. అనంతరం దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు.

కేంద్ర కేబినెట్‌లో టీడీపీ మంత్రులు కూడా ఉంటారు. వారు కూడా ఆమోదించిన తరువాతనే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు బడ్జెట్ గురించి బాబుకు తెలియకుండా ఉంటుందా? మరల చంద్రబాబు ఇప్ప్పుడొచ్చి ఏమి తెలియని వాడిలా బడ్జెట్‌ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మీడియా ముందు గింజుకుంటున్నారు. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని” జగన్ మండిపడ్డారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు మంత్రులుగా ఉన్న ని ఎంపీలు ఈ బడ్జెట్‌కు ఆమోదం ఎందుకు తెలిపారు ? అని జగన్, చంద్రబాబుని నిలదీశారు. చంద్రబాబు నాలుగేళ్లు నిరీక్షించి.. విసుగెత్తిపోయామని మీడియాకు లీకులు ఇస్తూ ఇప్పుడేమో మొసలి కన్నీరు కారుస్తున్నారు అని జగన్ అన్నారు. చంద్రబాబుకు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారు. ఆ సమయంలోనే ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ అన్యాయం తానే చేశానని బాబుకి అప్పుడు గుర్తొస్తుందని జగన్ ఎద్దేవా చేశారు.