Home రాజకీయాలు అజ్ఞాతవాసిగా ఎందుకు ఉన్నావ్?

అజ్ఞాతవాసిగా ఎందుకు ఉన్నావ్?

SHARE

బడ్జెట్‌పై ఇంత రచ్చ జరుగుతుంటే చంద్రబాబు అజ్ఞాతవాసిగా ఎందుకు మారిపోయారని చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

అండర్‌ గ్రౌండ్‌ నుంచి డైరెక్షన్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఏమైనా మావోయిస్టా, టెర్రరిస్టా అని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు అండర్‌ గ్రౌండ్‌లో ఎందుకు దాక్కున్నారని నిలదీశారు.

టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తామంటుంటే… అదే సమయంలో టీడీపీ కేంద్రమంత్రులు ఇద్దరు ప్రధాని, ఆర్థిక మంత్రి పక్కన ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు.

చివరకు టీడీపీ ఎంపీలు ఆడుడుతున్న నాటకాన్ని సీరియన్ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్ లాంటి వారు కూడా ఎండగడుతున్నారని గుర్తు చేశారు. అసలు టీడీపీ కేంద్రంలో భాగస్వామిగానే ఉందా.. ఉంటే పార్లమెంట్‌లో ఈ క్రేజీ సీన్లు ఏంటని రాజ్‌దీప్ చేసిన విమర్శలను బొత్స ప్రస్తావించారు.

అవినీతి బయటపడుతుందనే చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నది నిజమా కాదా చెప్పాలన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని కోతలు ప్రసారం చేయించుకోవడం తప్ప చంద్రబాబు ఏమీ చేయడం లేదన్నారు.

ప్రజలు ఆందోళనలో ఉంటే సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు తనకొచ్చిన గజకర్ణగోకర్ణ విద్యలతో ప్రజలను వంచన చేస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. మీడియా కూడా పదేపదే జగన్‌ ను విమర్శిస్తోందే గానీ.. చంద్రబాబును ఎందుకు బయటకు రావడం లేదో మాత్రం ప్రశ్నించడం లేదని బొత్స విమర్శించారు.