Home సినిమా మణిశర్మ స్టూడియాలో నాలుగున్నర లక్షల దొంగతనం

మణిశర్మ స్టూడియాలో నాలుగున్నర లక్షల దొంగతనం

SHARE

మణిశర్మ తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తను కూడా ఒక్కరు.. ఈ సంగతి అందరికి తెలిసిందే. ఈయన చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. ప్రస్తుతం ఈయన మ్యూజిక్ కంటే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ నే ఎక్కువగా చేస్తున్నారు. దానిపైనే ఎక్కువ శ్రద్ద కూడా పెట్టుతున్నారని సమాచారం. అయితే మణిశర్మ కు ఒక రికార్డింగ్ స్టూడియో ఉన్నది. ఆ స్టూడియాలో నాలుగున్నర లక్షల దొంగతనం జరిగిందంట.

అయినా బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం చెన్నై వెళ్లారు. వెళ్లే ముందు తన రికార్డింగ్ స్టూడియోలోని బీరువాలో నాలుగున్నర లక్షల రూపాయలను దానిలో పెట్టి వెళ్లారు. అయితే చెన్నై లో తన పనులను పూర్తి చేసుకుని ఫెబ్రవరి 2 వ తేదీన తిరిగి హైద్రాబాద్ కు వచ్చారు. వచ్చిన తరువాత బీరువాలో డబ్బు ను తీసుకుందామని చుస్తే దానిలో డబ్బు కనిపించలేదు. దానితో అయినా పోలీసులను ఆశ్రయించారు. తనకి తన స్టూడియాలో పనిచేస్తున్న వెంకట్ పైన్ అనుమానం ఉన్నదని పోలీసులకు చెప్పాడు.దీనితో పోలీసులు కేస్ నమోదు చేసుకుని వెంకటేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.