Home సినిమా ట్రీట్మెంట్ పూర్తిచేసుకున్న బాలయ్య

ట్రీట్మెంట్ పూర్తిచేసుకున్న బాలయ్య

208
SHARE

బాలకృష్ణ తరువాత తీయబోయే చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్”. అయితే ఆ సినిమా షూటింగ్ కి వెళ్లేముందే బాలకృష్ణ చేతికి సర్జరీ చేపించుకోవాలని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో? లేదో? అర్ధంకాలేదు. కాని ఇప్పుడు అయినా ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ అనంతరం డాక్టర్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హలచల్ అవుతుంది.

బాలకృష్ణ తన వందోవ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో తన చేతికి గాయం అయిందంట. అప్పుడు డాక్టర్స్ సర్జరీ చేపించుకోవాలని చెప్పిన తన ఒప్పుకున్నా సినిమాలకు ఆటంకం రాకూడదని తను ఇచ్చిన డేట్స్ ప్రకారం పైసా వసూల్, జై సింహ సినిమాలని పూర్తి చేశారంట. ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేస్తున్నారు. ఇంకా ఆ చేయికి సర్జరీ చేపించకపోతే భవిషత్ కాలంలో ఇబ్బంది పడవలసి వస్తుందని డాక్టర్స్ చెప్పండంలో ఎన్టీఆర్ బయోపిక్ ముందే అయినా సర్జరీ చేపించుకున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్ లో డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి తో పాటు పూణే నుంచి స్పెషల్ డాక్టర్ ఆసీస్ బాబుల్కార్ బాలకృష్ణ కి ట్రీట్మెంట్ చేశారంట. ట్రీట్మెంట్ పూర్తి అయినా తరువాత బాలకృష్ణ డాక్టర్ తో సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో హలచల్ అవుతుంది.

డాక్టర్స్ బాలకృష్ణకి సర్జరీ చేశాము కదా మీకు దీనివలన ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఒక 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆ తరువాత మీరు సినిమాలు చేయవచ్చునని చెప్పారంట. కాని ఎంతయినా కుటుంబ సభ్యులకు భయం ఉంటుంది కదా? రెండు నెలల పాటు విశ్రాంతి తరువాతే తరువాత చిత్రం చేయాలని అంటున్నారంట. ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పనిలో ఉన్నారంట దర్శకుడు తేజ. అయితే బాలకృష్ణ చేయికి సర్జరీ జరిగింది కాబ్బటి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తరువాత మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట. ఆ సినిమా పూర్తి చేసిన తరువాతే తన తరువాత సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారంట.